సుష్మా స్వరాజ్ అంత్యక్రియల వివరాలు!
- తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూత
- 12 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం
- లోధీ రోడ్ శ్మశానంలో అంత్యక్రియలు
ఇక ఈ మధ్యాహ్నం 12 గంటలకు ఆమె అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. తొలుత ఆమె మృతదేహాన్ని బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. అక్కడ మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకూ కార్యకర్తలు, నేతల సందర్శనార్థం ఉంచుతారు. 3 గంటల తరువాత అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. జంతర్ మంతర్ నుంచి బీజేపీ కేంద్ర కార్యాలయం, లోధీ రోడ్ కు వెళ్లే రహదారులను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.