KCR: తెలంగాణపై ఈర్ష్యతోనే జయప్రకాశ్ నారాయణ అలా మాట్లాడుతున్నారు: కేసీఆర్

  • ధర్మపురి క్షేత్రం వద్ద కేసీఆర్ ప్రెస్ మీట్
  • కాళేశ్వరం ప్రాజక్టు గురించి జేపీకి ఏం తెలుసని ప్రశ్నించిన కేసీఆర్
  • జేపీ తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి అంటూ మండిపాటు
సీఎం కేసీఆర్ ఇవాళ మేడిగడ్డ బ్యారేజిని పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణపై విమర్శలు చేశారు. జయప్రకాశ్ నారాయణ తెలంగాణపై ఈర్ష్యతోనే కాళేశ్వరం ప్రాజక్టుపై వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు కాళేశ్వరం ప్రాజక్టు గురించి జేపీకి ఏం తెలుసని మాట్లాడుతున్నారని నిలదీశారు. ఏనాడైనా మేడిగడ్డ ప్రాజక్టు వద్దకు వచ్చారా? అంటూ ప్రశ్నించారు. ఇలాంటి నేతల విమర్శలను తాము పట్టించుకోబోమని, జేపీ ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని కూడా వ్యతిరేకించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
KCR
Telangana
Jayaprakash Narayan
Loksatta

More Telugu News