Loksabha: లోక్ సభలో లడఖ్ ఎంపీ ప్రసంగానికి మార్మోగిన చప్పట్లు.. మోదీ ప్రశంసలు

  • జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుపై లోక్ సభలో చర్చ
  • నమగ్యాల్ ప్రసంగంపై ఎన్డీఏ సభ్యుల ప్రశంసలు
  • తప్పకుండా వినాల్సిన ప్రసంగం ఇది అన్న మోదీ
జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్ సభ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అయితే, ఈ బిల్లుపై చర్చ సందర్భంగా లడక్ బీజేపీ ఎంపీ సేరింగ్ నమగ్యాల్ చేసిన ప్రసంగానికి సభలో చప్పట్టు మార్మోగిపోయాయి. లడఖ్ కు కేంద్ర పాలిత ప్రాంత హోదా కోసం ఇక్కడి ప్రజలు ఏడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారని చెప్పడంతో పాటు, ప్రజల తరపున తన భావాలను వ్యక్తీకరించిన తీరు ఆకట్టుకుంది. దీంతో, ఎన్డీఏ సభ్యులు బల్లలు చరుస్తూ మరింత ఉత్సాహపరిచారు. నమగ్యాల్ ప్రసంగానికి ప్రధాని మోదీ కూడా ఫిదా అయ్యారు.

జమ్ముకశ్మీర్ కు చెందిన కీలక బిల్లుపై చర్చిస్తున్న సమయంలో తన యువ స్నేహితుడు నమగ్యాల్ అద్భుతంగా తన అభిప్రాయాలను పంచుకున్నారని కొనియాడారు. లడఖ్ లోని తమ సోదరసోదరీమణుల ఆకాంక్షలను ప్రతి ఫలించేలా నమగ్యాల్ ప్రసంగించారని, తప్పకుండా వినాల్సిన ప్రసంగం ఇది అని మోదీ కొనియాడారు.
Loksabha
Mp
Tsering
Ladak
Pm
Modi

More Telugu News