Kashmir: కశ్మీర్ లో మారుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాం: అమెరికా

  • కశ్మీర్ పై చర్యలు భారత్ అంతర్గత వ్యవహారం
  • జరుగుతున్న పరిణామాలను భారత్ మాకు వివరించింది
  • నియంత్రణ రేఖ వద్ద ప్రశాంతత నెలకొనేలా పాక్ వ్యవహరించాలి

జమ్ముకశ్మీర్ విషయంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని అమెరికా విదేశాంగశాఖ తెలిపింది. అయితే, ఇది పూర్తిగా భారత్ కు సంబంధించిన అంతర్గత వ్యవహారమని స్పష్టం చేసింది. అయితే, కొందరు రాజకీయవేత్తలను అరెస్ట్  చేశారనే వార్తలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయని యూఎస్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మోర్గాన్ అన్నారు. జమ్ముకశ్మీర్ లో రాజ్యంగపరమైన మార్పులు తీసుకురావడం, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడంపై భారత్ తమకు వివరించిందని చెప్పారు.

ఇదే సమయంలో పాకిస్థాన్ ను ఉద్దేశించి అమెరికా విదేశాంగశాఖ ఒక సూచన చేసింది. నియంత్రణ రేఖ వద్ద శాంతియుత వాతావరణం నెలకొనేలా పాక్ లోని అన్ని పార్టీలు వ్యవహరించాలని సూచించింది.

More Telugu News