ప్రాణం పోయినా జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేయను: పవన్
- పార్టీని బీజేపీలో విలీనం చేస్తారనేది తప్పుడు ప్రచారం
- ఆ ప్రచారాన్ని నమ్మొద్దు
- పార్టీని నడిపేందుకు వేల కోట్లు అవసరం లేదు
తనను ఓడించిన ఈ నేల నుంచే తనపై నమ్మకంతో ఓటేసిన ప్రతి ఒక్కరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నానని, జనసేనను ఏ పార్టీలోనూ విలీనం చేయబోనని పవన్ పునరుద్ఘాటించారు. టీడీపీతో జనసేన లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుందని ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారం చేశారని పవన్ అన్నారు. తాను ఎవరితోనూ లోపాయికారీ ఒప్పందాలు పెట్టుకోనని, ఏదైనా ఉంటే అందరికీ చెప్పే చేస్తానని పేర్కొన్నారు. పార్టీని నడపడానికి వేల కోట్ల రూపాయలు అవసరం లేదని, టన్నుల కొద్దీ ఆశయం ఉంటే చాలని పవన్ అన్నారు.