Congress: రాజ్యసభకు కాంగ్రెస్ చీఫ్ విప్ భువనేశ్వర్ రాజీనామా.. ఆమోదించిన వెంకయ్యనాయుడు

  • అసోం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భువనేశ్వర్ కలిత
  • ఆర్టికల్ 370 విషయంలో విప్ జారీ చేయమన్న అధిష్ఠానం
  • మళ్లీ విధ్వంసం దిశగానే పార్టీ నడుస్తోందన్న భువనేశ్వర్

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, చీఫ్ విప్ భువనేశ్వర్ కలిత తన రాజ్యసభ సభ్వత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆయన రాజీనామాను ఆమోదించారు. ఆర్టికల్ 370 రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ భువనేశ్వర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటిలానే విధ్వంసం దిశగా వెళ్తుండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు భువనేశ్వర్ తెలిపారు.

ఆర్టికల్ 370 విషయంలో విప్ జారీ చేయాలని పార్టీ ఆదేశించిందని, దేశ ప్రజల వైఖరికి ఇది విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. అందులో తాను భాగస్వామిని కాకూడదనే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు ఆయన వివరించారు. అసోం నుంచి రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్న కలిత రాజ్యసభ పదవీ కాలం  వచ్చే ఏడాది ఏప్రిల్ 9తో ముగియనుంది. కాగా, త్వరలోనే తన భవిష్యత్ ప్రణాళికను వెల్లడిస్తానని భువనేశ్వర్ కలిత పేర్కొన్నారు.

More Telugu News