Airindia: ప్రమాదాన్ని తప్పించుకున్న ఎయిరిండియా విమానం

  • మార్గమధ్యంలో ఇంధనం సరిపోదని గుర్తించిన పైలెట్లు
  • కోల్ కతా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానం
  • అమృత్ సర్ కు మళ్లించిన పైలెట్లు
  • రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీ వెళ్లిన ఎంపీలు

కోల్ కతా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానానికి ప్రమాదం తప్పింది. గమ్యస్థానానికి చేరేవరకు ఇంధనం సరిపోదన్న విషయాన్ని పైలెట్లు మార్గమధ్యంలో గుర్తించడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. అయితే, పైలెట్లు విమానాన్ని అమృత్ సర్ లో దింపేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విమానంలో ఐదుగురు పార్లమెంటు సభ్యులు కూడా ఉన్నారు.

ఎయిరిండియాకు చెందిన ఏఐ-021 విమానం ఈ మధ్యాహ్నం 150 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బందితో కోల్ కతా ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ తీసుకుంది. ముగ్గురు లోక్ సభ సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా ప్రయాణికుల్లో ఉన్నారు. అయితే, విమానం ప్రయాణిస్తుండగా ఇంధనం తగినంతగా లేదన్న విషయాన్ని పైలెట్లు గుర్తించారు. ఆలస్యం చేయకుండా సమీపంలోని అమృత్ సర్ విమానాశ్రయానికి విమానాన్ని మళ్లించి సురక్షితంగా కిందికి దించారు. దాంతో ఎంపీలు చేసేది లేక రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీ చేరుకున్నారు.

More Telugu News