ఆర్టికల్ 370 నేటితో చచ్చిపోయింది... దాంతో పాటే 35A కూడా!: సుబ్రహ్మణ్యస్వామి

  • కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం
  • రాజ్యాంగ సవరణ అవసరంలేదని గతంలోనే చెప్పానన్న స్వామి
  • తాను చెప్పిందే ఇప్పుడు నిరూపితమైందంటూ ట్వీట్
కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని ఎన్డీయే ప్రభుత్వం  రద్దు చేయడం పట్ల బీజేపీ అగ్రనేత సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. ఆర్టికల్ 370 ఈ రోజుతో చచ్చిపోయిందని, దాంతో పాటే 35A కూడా అంతరించిపోయిందని ట్వీట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరంలేదని తాను గతంలోనే చెప్పిన విషయం ఇప్పుడు నిరూపితమైందని అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఓ తీర్మానం రూపంలో ఆర్టికల్ 370 రద్దు విషయాన్ని పార్లమెంటు ముందు ఉంచారని, దానికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించిందని పేర్కొన్నారు. 
Go Back to Shorts
Subramanian Swamy
BJP
Article 370
35A
Jammu And Kashmir

More Telugu News