Telangana: నల్లమల అటవీప్రాంతానికి కోదండరాం.. మార్గమధ్యంలోనే అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు!
- నాగర్ కర్నూలు ప్రాంతంలో యురేనియం తవ్వకాలు
- గిరిజనులకు అవగాహన కల్పించేందుకు బయలుదేరిన నేత
- హాజీపూర్ చౌరస్తా వద్ద అడ్డుకుని స్టేషన్ కు తరలించిన పోలీసులు
నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీప్రాంతంలో ఈరోజు తెలంగాణ జనసమితి అధినేత కోదండరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు బలవంతంగా తరలించారు. జిల్లాలోని అటవీప్రాంతంలో యురేనియం ఖనిజం తవ్వకాలపై గిరిజనులకు అవగాహన కల్పించేందుకు కోదండరాం మరికొందరు టీజేఎస్ నేతలతో కలిసి అక్కడకు వెళ్లారు.
అయితే మార్గమధ్యంలోనే అచ్చంపేట మండలం హాజీపూర్ చౌరస్తా వద్ద పోలీసులు కోదండరాంను అడ్డుకున్నారు. అనంతరం బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. దీంతో పోలీసుల చర్యపై ఆగ్రహించిన గిరిజనులు శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అడవి బిడ్డలు ఆందోళనకు దిగడంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించింది.