Anasuya: "ఊరంటే వంద, రెండు వందలు ఇళ్లు కాదు"... ఆసక్తి కలిగిస్తున్న అనసూయ కొత్త చిత్రం ట్రయిలర్

  • యాంకర్ అనసూయ ప్రధానపాత్రలో 'కథనం'
  • రాజేశ్ నాదెండ్ల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం
  • ఆగస్టు 9న విడుదల
ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్ నటించిన తాజా చిత్రం 'కథనం'. ఉత్కంఠ రేపే కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ట్రయిలర్ ఎంతో ఆసక్తి కలిగిస్తోంది. ఈ చిత్రానికి రాజేశ్ నాదెండ్ల దర్వకత్వం వహించాడు. "ఊరంటే వంద, రెండు వందలు ఇళ్లు కాదు... మట్టితో పెనవేసుకున్న తరతరాల బంధం" అంటూ ట్రయిలర్ ముగింపులో వచ్చే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. అనసూయ ప్రధానపాత్రలో వస్తున్న 'కథనం' సినిమాలో అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, ధన్ రాజ్, పృథ్వీరాజ్ ముఖ్యపాత్రలు పోషించారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 9న విడుదల కానుంది. అనసూయ ఇందులో చిత్ర దర్శకురాలి పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.

Anasuya
Kathanam
Trailer
Tollywood

More Telugu News