Andhra Pradesh: సీఎం జగన్ జెరూసలేం టూర్.. ఇజ్రాయెల్ రైతులతో ప్రత్యేకంగా భేటీ!

  • నీటి యాజమాన్య పద్ధతుల్ని అడిగితెలుసుకున్న జగన్
  • అంతకుముందు క్రైస్తవ పుణ్యక్షేత్రాల సందర్శన
  • ఈ నెల 5న విజయవాడకు తిరిగిరానున్న సీఎం 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి జెరూసలేం(ఇజ్రాయెల్) పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. పలు క్రైస్తవ పుణ్యక్షేత్రాలను ఆయన దర్శించుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఇజ్రాయెల్ రైతులతో సమావేశమయ్యారు. తక్కువ నీటితో అత్యధిక దిగుబడి సాధించేదిశగా ఇజ్రాయెల్ రైతులు అనుసరిస్తున్న పద్ధతులను అడిగి తెలుసుకున్నారు.

కాగా, తన నాలుగు రోజుల పర్యటన ముగించుకుని ఏపీ సీఎం జగన్ ఈ నెల 5న విజయవాడకు తిరిగి రానున్నారు. నీటి పొదుపు, పునర్వినియోగం విషయంలో ఇజ్రాయెల్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఎడారిలో ఉన్నప్పటికీ తక్కువ నీటితో భారీ స్థాయిలో దిగుబడిని సాధిస్తోంది.
Andhra Pradesh
Jagan
Chief Minister
israel
tour
Water management methods
CM enquires about farming
Farmers of Israel

More Telugu News