Krishna District: కృష్ణా జిల్లా టీడీపీ సమావేశానికి కేశినేని, వల్లభనేని డుమ్మా

  • జిల్లా సమీక్షా సమావేశానికి రాని నేతలు
  • చర్చనీయాంశమైన నేతల గైర్హాజరు
  • తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు సమావేశం
సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ వ్యాప్తంగా నిర్వహిస్తున్న జిల్లా సమావేశాల్లో భాగంగా ఈరోజు ఉదయం కృష్ణా జిల్లా సమావేశం జరిగింది. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ సీనియర్‌ నేతలు, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీతోపాటు పలువురు కీలకనేతలు డుమ్మాకొట్టారు. పార్టీలో జిల్లాకు చెందిన కీలక నేతలే ముఖ్య సమావేశానికి గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. ఎటువంటి సమాచారం లేకుండా వీరు గైర్హాజరు కావడంపై తలోరకంగా వ్యాఖ్యానిస్తున్నారు. సదరు నేతలు పార్టీ మారే యోచనలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.
Krishna District
Telugudesam
district meet
kesineni
Vallabhaneni Vamsi

More Telugu News