chaina: చంద్రుడిని ఢీకొట్టి ధ్వంసమైన చైనా వ్యోమ నౌక

  • గత ఏడాది జాబిల్లిపైకి పంపిన డ్రాగన్‌
  • దీని బరువు 47 కిలోలు
  • 437 రోజులపాటు చంద్రుడి చుట్టూ భ్రమణం

భారత్‌ చంద్రయాన్‌-2తో జాబిల్లివైపు దూసుకుపోతున్న వేళ చైనాకు చెందిన ఓ వ్యోమనౌక చందమామను ఢీకొట్టి ధ్వంసమైంది. గత ఏడాది మేలో డ్రాగన్‌ చంద్రునిపైకి ‘లాంగ్‌జియాంగ్‌-2’ పేరుతో వ్యోమనౌకను ప్రయోగించింది. ఈ నౌక నిన్న జాబిల్లి ఉపరితలాన్ని ఢీకొట్టి అంతమైంది. 47 కిలోల బరువున్న ఈ బుల్లి వ్యోమ నౌక చంద్రుడి చుట్టూ 437 రోజుపాటు పరిభ్రమించింది. ఈ వ్యోమనౌకలో సౌదీ అరెబియాకు చెందిన ఓ ఆప్టికల్‌ కెమెరాను అమర్చారు. కాగా, తాము ప్రయోగించిన వ్యోమనౌక అనుకున్న సమయంలో తన పని పూర్తిచేసుకుని నిర్దేశిత ప్రాంతంలోనే జాబిల్లి ఆవలి ప్రాంతాన్ని ఢీకొట్టి ధ్వంసమైందని చైనా అంతరిక్ష సంస్థ ప్రకటించింది.

More Telugu News