Andhra Pradesh: మీ ప్యాకేజీ పురాణాలు విప్పితే చెడ్డీ కూడా మిగలదు!: కేశినేనికి పీవీపీ కౌంటర్

  • కెనరా బ్యాంకు ఆస్తుల వేలంపై టీడీపీ విమర్శలు
  • ట్విట్టర్ వేదికగా తిప్పికొట్టిన వైసీపీ నేత
  • తాను పన్ను చెల్లించడంలో టాప్ అన్న పీవీపీ
టీడీపీ నేత కేశినేని నానిపై వైసీపీ నాయకుడు పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) మరోసారి మండిపడ్డారు. కెనరా బ్యాంకు తన ఆస్తులను వేలం వేయడంపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. ఈరోజు ట్విట్టర్ లో పీవీపీ స్పందిస్తూ.. ‘మా యాపారాలు, యవ్వారాలు చూసుకోడం మాకు తెలుసు. దొబ్బలేక, ముసుగు కప్పుకుని, మూసుకుని ట్విట్టర్లో కాపురం చేయట్లా. ఈ మధ్య పేపర్ గాళ్ళు, అబ్బో టాక్స్ కట్టారని ఒక టీవీ గాడు కూడా పెట్టారు.

మీ ప్యాకేజీ పురాణాలు విప్పితే, చెడ్డి కూడా మిగలదు. దేశం మారిందోయ్, కాలం మారిందోయ్’ అని చెప్పారు. తాను గత ఏడాదికాలంలో కట్టిన పన్నును కేశినేని ఫ్యామిలీ గత 90 ఏళ్లలో కూడా కట్టలేదని ఎద్దేవా చేశారు. దమ్ముంటే, మగాడివైతే తనలా పన్ను కట్టడంలో ఆదర్శప్రాయుడిగా నిలవాలని సవాల్ విసిరారు.
Andhra Pradesh
Telugudesam
Kesineni Nani
YSRCP
PVP
Twitter

More Telugu News