young girl: యువతిని కిడ్నాప్ చేసిన 18 మంది యువకులు.. ఇంకా దొరకని ఆచూకీ!

  • కర్ణాటకలోని సిరుగుప్ప పట్టణంలో ఘటన
  • 15 రోజుల క్రితం యువతి కిడ్నాప్
  • యువతిని ఎందుకు కిడ్నాప్ చేశారో రాని స్పష్టత
కర్ణాటకలోని బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని సిరుగుప్ప పట్టణంలో 10వ వార్డుకు చెందిన హారతి అనే యువతి 15 రోజుల క్రితం ఆదృశ్యమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఆమెను 18 మంది యువకులు కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు.

వెంటనే కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో సీఐ మౌనేశ్వర పాటిల్ ఆధ్వర్యంలో నిందితుల కోసం గాలింపును ముమ్మరం చేశారు. అయితే యువతిని ఎందుకు కిడ్నాప్ చేశారన్న విషయమై ఇటు తల్లిదండ్రులు, అటు పోలీసులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.  
young girl
kidnaped
Karnataka
Police
18 men

More Telugu News