కశ్మీర్ లో ఉగ్రవాదిని కాల్చి చంపిన జవాన్లు
- సోపోర్ జిల్లా మల్మపన్ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నట్టు పక్కా సమాచారం
- ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టిన భద్రతాదళాలు
- కొనసాగుతున్న ఎన్ కౌంటర్
సోపోర్ జిల్లా మల్మపన్ ప్రాంతంలో ముష్కరులు ఉన్నారనే పక్కా సమాచారంతో నిర్బంధ తనిఖీలను భద్రతా సిబ్బంది చేపట్టింది. ఈ క్రమంలో, భద్రతాబలగాలపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఓ జవాను గాయపడ్డారు. భద్రతాబలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి.