Pakistan: జాదవ్‌తో భారత్‌ అధికారుల భేటీ విషయంలో పాకిస్థాన్‌ కొత్త కండిషన్‌

  • తమ అధికారి కూడా ఉంటాడని వెల్లడి
  • భేటీ మొత్తాన్ని వీడియో తీస్తామని స్పష్టీకరణ
  • నిబంధనలకు విరుద్ధమంటున్న భారత్‌ అధికారులు

భారత్‌కు చెందిన కులభూషణ్‌ జాదవ్‌ విషయంలో పాకిస్థాన్‌ కొత్త మెలిక పెట్టింది. తమ దేశంలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడేందుకు కుట్రపన్నాడంటూ జైల్లోపెట్టిన జాదవ్‌కు అక్కడి న్యాయస్థానం ఉరి శిక్ష విధించిన విషయం తెలిసిందే. దీనిపై భారత్‌ అంతర్జాతీయ న్యాయ స్థానాన్ని ఆశ్రయించడంతో తాత్కాలికంగా ఉరి నిలిచిపోయింది.  అదే సమయంలో జాదవ్‌ను కలుసుకునేందుకు భారత్‌ అధికారులను అనుమతించాలని కూడా ఆదేశించింది. అంతర్జాతీయ న్యాయ స్థానం ఆదేశాల మేరకు భారత్‌ విదేశాంగ శాఖ అధికారులు ఈరోజు జాదవ్‌ను కలవాల్సి ఉంది. ఈ సమయంలో పాకిస్థాన్‌ కొత్త నిబంధన తెరపైకి తెచ్చింది.

భారత్‌ అధికారులతోపాటు తమ అధికారి కూడా ఒకరు ఉంటారని స్పష్టం చేసింది. అలాగే సీసీ కెమెరాల నిఘాలోనే అధికారులు భేటీ కావాలని స్పష్టం చేసింది. ఈ వాదనపై భారత్‌ ఆశ్చర్యం, అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వియన్నా ఒప్పందం ప్రకారం ఇతర దేశాల్లో బందీలుగా ఉన్న వ్యక్తులను వారి దేశాలకు చెందిన అధికారులు ఏ ఆటంకం లేకుండా కలుసుకోవచ్చన్న విషయాన్ని పాకిస్థాన్‌కు గుర్తు చేశారు. దీనిపై అక్కడి అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

More Telugu News