సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

03-08-2019 Sat 07:36
  • విజయ్ సేతుపతి సరసన అదితి
  • ఆ సినిమా నుంచి తప్పుకున్న రేణు దేశాయ్ 
  • మహి వి.రాఘవ్ దర్శకత్వంలో 'సిండికేట్' 
  • అర్జున్ తో కార్తికేయ మరో చిత్రం 
*  అందాలతార అదితీరావు హైదరి తమిళంలో ఓ చిత్రానికి సంతకం చేసింది. విజయ్ సేతుపతి హీరోగా నటించే 'తుగ్లక్ దర్బార్' చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటిస్తుంది. రాజకీయాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
*  ప్రముఖ నటి రేణు దేశాయ్ మళ్లీ సినిమాల్లోకి వస్తున్నట్టు, ఈ క్రమంలో 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రంలో నటించడానికి అంగీకరించినట్టు ఇటీవల వార్తలొచ్చాయి. వీటిని ఆమె కూడా ధ్రువీకరించింది. అయితే, ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్టు తాజా సమాచారం. ఆమె ఎందుకు తప్పుకుందన్నది తెలియాల్సివుంది. కాగా, ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు.
*  వైఎస్సార్ బయోపిక్ గా ఆమధ్య వచ్చిన 'యాత్ర' చిత్రం ద్వారా దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మహి వి. రాఘవ్ తన తదుపరి చిత్రాన్ని ఓకే చేసుకున్నాడు. పీవీపీ సంస్థ నిర్మించే 'సిండికేట్' చిత్రానికి రాఘవ్ దర్శకత్వం వహించనున్నాడు. ఇది యాక్షన్ చిత్రంగా రూపొందుతుంది.  
*  కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన 'గుణ 369' చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో తాను అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేయనున్నట్టు హీరో కార్తికేయ ప్రకటించాడు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం ఉంటుందని చెప్పాడు.