UAPA: యూఏపీఏ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

  • రాజ్యసభలో యూఏపీఏ బిల్లుపై తీవ్ర స్థాయిలో చర్చ
  • ఈ బిల్లుకు అనుకూలంగా 147 ఓట్లు
  • వ్యతిరేకంగా 42 ఓట్లు  

చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక సవరణ (యూఏపీఏ) బిల్లుకు ఈ రోజు రాజ్యసభ ఆమోదం లభించింది. మొదట బిల్లుపై సభ్యుల వాద ప్రతివాదాల నడుమ చర్చ జరిగింది. అనంతరం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. యూఏపీఏ బిల్లుకు అనుకూలంగా 147 ఓట్లు, వ్యతిరేకంగా 42 ఓట్లు వచ్చాయి. యూఏపీఏ సవరణ బిల్లును స్థాయీ సంఘానికి పంపాలన్న విపక్షాల ప్రతిపాదన వీగిపోయింది. ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా 104 మంది సభ్యులు, అనుకూలంగా 85 మంది సభ్యులు ఓటు వేయడం గమనార్హం.

భిన్న ధోరణి వల్లే ఈ సవరణను వ్యతిరేకిస్తున్నా: చిదంబరం

  ఈ బిల్లుపై  చర్చ సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాడివేడీ చర్చ జరిగింది. ఈ బిల్లు కారణంగా మామూలు వ్యక్తులపై ఉగ్రవాదులన్న ముద్ర పడే ప్రమాదం ఉందని కాంగ్రెస్ నేత చిదంబరం అభ్యంతరం వ్యక్తం చేశారు.  

ఈ బిల్లుకు సవరణ మాత్రమే తెస్తున్నాం: అమిత్ షా

ఈ వ్యాఖ్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందిస్తూ, ఈ బిల్లుకు సవరణ మాత్రమే తెస్తున్నామని, చట్టం చేయడం లేదని స్పష్టం చేశారు. మానవత్వానికి వ్యతిరేకంగా మెలిగే వాళ్లే ఉగ్రవాదులని, సంస్కరణలను ఏ విధంగా చేస్తామో, అలాగే ఉగ్రవాదుల విషయంలో మరో ముందడుగు వేస్తామని చెప్పారు.

More Telugu News