Wipro: విప్రో కొత్త అధినేతగా బాధ్యతలు అందుకున్న రిషద్ ప్రేమ్ జీ

  • చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్న అజీమ్ ప్రేమ్ జీ
  • తనయుడికి బాధ్యతలు అప్పగింత
  • హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన రిషద్

దశాబ్దాల చరిత్ర ఉన్న విప్రో సంస్థలో అధినాయకత్వ మార్పు జరిగింది. 53 ఏళ్లుగా సంస్థను ఉన్నతస్థాయికి చేర్చడంలో అవిశ్రాంత కృషి చేసిన అజీమ్ ప్రేమ్ జీ బాధ్యతల నుంచి తప్పుకోగా, సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఆయన తనయుడు రిషద్ ప్రేమ్ జీ నియమితులయ్యారు.

అజీమ్ ప్రేమ్ జీ చైర్మన్ పదవి నుంచి తప్పుకోవాలని జూన్ లోనే నిర్ణయించుకున్నారు. చైర్మన్ గా తప్పుకున్నా, నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో బోర్డు సభ్యుడిగా కొనసాగనున్నారు. ఇక 42 ఏళ్ల రిషద్ ప్రేమ్ జీ నాయకత్వంలో విప్రో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని సంస్థ వర్గాలు భావిస్తున్నాయి. రిషద్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. 2007లో విప్రోలో బిజినెస్ మేనేజర్ గా అడుగుపెట్టిన రిషద్ అంచెలంచెలుగా ఎదుగుతూ అత్యున్నత పీఠం అధిష్ఠించారు.

More Telugu News