congress: ముస్లిం మహిళలపై ఒడిశా బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు!

షార్ట్స్‌లో చూడండి
ముస్లిం మహిళలపై ఒడిశాకు చెందిన బీజేపీ ఉపనాయకుడు బిష్ణు సేథీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లు ఆమోదం పొందిన విషయమై ఒడిశా అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా బిష్ణు సేథీ మాట్లాడుతూ, ముంబై, కోల్ కతాల్లోని వేశ్యా గృహాల్లో ముస్లిం మహిళలు ఎక్కువగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేడీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలు తొలగించాలని డిమాండ్ చేశారు.

ఆ తర్వాత జీరో అవర్ లో సేథీ స్పందిస్తూ, ముంబై, కోల్ కతాలోని రెడ్ లైట్ ఏరియాలో ముస్లిం మహిళలే ఎక్కువగా ఉన్నారన్న విషయాన్ని వార్తాపత్రికలు, మేగజైన్ల సర్వేలో వెల్లడైందని, ఆ విషయాన్ని ప్రస్తావించాను తప్ప, తానేమీ తక్కువ చేసి మాట్లాడలేదని సమర్థించుకున్నారు. మైనార్టీల ఓట్ల కోసమే ట్రిపుల్ తలాక్ బిల్లును కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని విమర్శించారు. ముస్లిం మహిళల హక్కులను కాపాడేందుకు మానవతా దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించిందని అన్నారు. కాగా, ఒడిశాలోని ధామ్ నగర్ ఎమ్మెల్యే, ఆ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు బిష్ణు సేథీ. కవి, రచయితగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.
Go Back to Shorts
congress
BJD
BJP
Bishnu Sethi
Odisha

More Telugu News