GJ 357 d: సౌర కుటుంబానికి ఆవల మానవ నివాసానికి అనుకూల గ్రహం!

  • భూమికి 31 కాంతి సంవత్సరాల దూరంలో గ్రహం
  • కనుగొన్న నాసా ‘టెస్’
  • భూమికి మించిన ద్రవ్యరాశి

ఈ విశాల విశ్వంలో భూమిని పోలిన మరో గ్రహం కోసం అన్వేషిస్తున్న శాస్త్రవేత్తల కల ఫలించేలా కనిపిస్తోంది. సౌర కుటుంబానికి ఆవల మరో గ్రహాన్ని గుర్తించారు. ఓ మరుగుజ్జు నక్షత్రం చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహం మానవ నివాసానికి అనకూలంగా ఉండే అవకాశం ఉందని బావిస్తున్నారు. ఆ గ్రహంపై జీవం, నీరు పుష్కలంగా ఉండే అవకాశం ఉన్నట్టు శాస్త్రవేత్తలు ఓ అభిప్రాయానికొచ్చారు.

‘జీజే 357 డీ’గా పిలుస్తున్న ఈ గ్రహం సౌర కుటుంబం వెలుపల భూమికి దాదాపు 31 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా  అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాకు చెందిన ‘ట్రాన్సిటింగ్‌ ఎక్సోప్లానెట్‌ సర్వే ఉపగ్రహం(టెస్‌)’ దీనిని గుర్తించింది. భూమితో పోలిస్తే ఈ గ్రహం ద్రవ్యరాశి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి దీనిని ‘సూపర్ ఎర్త్’గా చెప్పుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. వాతావరణం కూడా ఈ గ్రహంపై దట్టంగా ఉందని చెబుతున్న శాస్త్రవేత్తలు అత్యాధునిక టెలిస్కోపులతో జీవం ఉనికిని గుర్తించవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News