Maharashtra: కేవలం 23 నిమిషాల్లో ముంబయి నుంచి పుణేకి తీసుకెళ్లే హైపర్ లూప్!

  • అత్యాధునిక రవాణా వ్యవస్థగా హైపర్ లూప్ కి గుర్తింపు
  • భారీ ప్రాజక్టును చేపట్టిన పీఎంఆర్ డీఏ
  • అంచనా వ్యయం రూ.70,000 కోట్లు

రవాణారంగంలో పెనువిప్లవం అనదగ్గ హైపర్ లూప్ భారత్ లోనూ అడుగుపెడుతోంది. ముంబయి నుంచి పుణే మధ్య హైపర్ లూప్ రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని మహారాష్ట్ర సర్కారు సంకల్పించింది. ఈ హైస్పీడ్ రవాణా వ్యవస్థలో భాగంగా భూమిలోపల ప్రత్యేకమైన ట్రాక్ నిర్మిస్తారు. ఓ క్యాప్సూల్ వంటి రవాణా సాధనంలో ప్రజలను ఒకచోటు నుంచి మరోచోటికి తరలిస్తారు. భూగర్భ రవాణా కావడంతో వాయునిరోధం చాలా తక్కువగా ఉంటుంది. తద్వారా అధికవేగం సాధ్యమవుతుంది.

ఆ లెక్కన ముంబయి నుంచి పుణేకి కేవలం 23 నిమిషాల్లో  చేరుకోవచ్చు. ఈ రెండు మహానగరాల మధ్య దూరం 117.5 కిలోమీటర్లు. పుణే మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (పీఎంఆర్ డీఏ) ఈ ప్రాజక్టును రూ.70,000 కోట్ల మేర అంచనాలతో చేపడుతోంది. ఈ ప్రాజక్టు పూర్తయ్యేందుకు 8 సంవత్సరాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.

More Telugu News