Sukumar: స్మగ్లింగ్ నేపథ్యంలోనే బన్నీ .. సుకుమార్ సినిమా

  • బన్నీ తదుపరి సినిమా సుకుమార్ తో 
  • వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • కథానాయికగా రష్మిక మందన     

'రంగస్థలం' సంచలన విజయాన్ని నమోదు చేసిన తరువాత సుకుమార్ తదుపరి సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన తదుపరి సినిమా బన్నీతో వుండనుందనే విషయం ఖరారైన దగ్గర నుంచి వాళ్లలో మరింత ఆత్రుత ఎక్కువైంది. కథా వస్తువు ఏమై ఉంటుందా అనే ఆసక్తి వాళ్లలో పెరుగుతూ వస్తోంది.

గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనేది తాజా సమాచారం. సౌత్ ఇండియాలోని దట్టమైన అడవుల్లో చిత్రీకరణను ప్లాన్ చేశారట. బన్నీ పాత్ర ఏమిటనే సస్పెన్స్ మాత్రం అలాగే వుంది. ఆయన సరసన నాయికగా రష్మిక మందనను తీసుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుందని సమాచారం. 

More Telugu News