Polavaram Project: పోలవరం ప్రాజెక్టు నుంచి 'నవయుగ'ను తప్పుకోమంటూ ఏపీ ప్రభుత్వ నోటీసులు

  • నవయుగ చేతిలో పోలవరం హెడ్ వర్క్ పనులు   
  • నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ప్రీక్లోజర్ నోటీసులు
  • జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి కూడా తప్పుకోవాలంటూ సూచన

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు నిర్మాణ పనులను కొనసాగిస్తున్న నవయుగ సంస్థను పక్కన పెడుతూ నిర్ణయం తీసుకుంది. నిర్మాణ పనుల నుంచి వైదొలగాలని నవయుగకు ఇరిగేషన్ శాఖ నోటీసులు జారీ చేసింది. నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రీక్లోజర్ నోటీసులను అందించింది.

ప్రస్తుతం పోలవరంలో 60సి నిబంధన ప్రకారం హెడ్ వర్క్ పనులను నవయుగ చేస్తోంది. దాదాపు రూ. 3 వేల కోట్ల విలువైన పనులను కొనసాగిస్తోంది. అంతేకాదు, రూ. 3,220 కోట్ల విలువైన జల విద్యుత్ టెండర్లను కూడా నవయుగ దక్కించుకుంది. జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి కూడా తప్పుకోవాలని నవయుగకు ఇరిగేషన్ శాఖ సూచించింది.

పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవినీతి చోటు చేసుకుందని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో నిపుణుల కమిటీ తెలిపింది. అంచనాలను పెంచి పనులను చేపట్టినట్టు నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

More Telugu News