Manchiryala: మంచిర్యాల జేసీ వాహనానికి జరిమానా!

  • హైదరాబాద్ లో తిరిగిన జేసీ వాహనం
  • వేగంగా వెళుతుంటే గుర్తించిన స్పీడ్ లేజర్ గన్
  • రూ. 1,035 జరిమానా విధించిన పోలీసులు

చట్టానికి ఎవరూ అతీతులు కాదని పోలీసులు నిరూపించారు. నిబంధనలు మీరితే ఎవరికైనా జరిమానా తప్పదని రుజువుచేశారు. వివరాల్లోకి వెళితే, మంచిర్యాల జాయింట్‌ కలెక్టర్‌ కు చెందిన వాహనం (టీఎస్‌ 19 సీ1009), ఈ నెల 28న హైదరాబాద్ కు వచ్చింది. అల్వాల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎల్లంపేట వద్ద స్పీడ్‌ లేజర్‌ గన్‌ కు దొరికిపోయింది.

 ఈ వాహనం అధిక వేగంతో వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు. నిర్దేశించిన వేగం కంటే, అధిక స్పీడ్ తో వెళుతున్నట్టు గుర్తించిన పోలీసులు ఈ-చలాన్ ను విధించారు. రూ. 1,000 జరిమానా, పైన యూజర్ చార్జీలు రూ. 35 కలిపి రూ. 1,035 జరిమానా విధించారు. కాగా, రహదారులపై అధిక వేగంతో వెళితే, స్పీడ్ లేజర్ గన్ లలోని సమాచారాన్ని అనుసరించి జరిమానా విధిస్తారు.

More Telugu News