సీఎం గారూ... భవన నిర్మాణ కార్మికుల బాధలు చూసి ఈ లేఖ రాస్తున్నా: పవన్ కల్యాణ్
- ప్రభుత్వానికి 100 రోజుల సమయం ఇస్తామని తొలుత ప్రకటించిన పవన్
- భవన నిర్మాణ కార్మికుల వెతలు చూసి మనసు మార్చుకున్న జనసేనాని
- కూలీలు, కార్మికుల ఆకలి బాధలు ప్రభుత్వానికి ఏమంత క్షేమకరం కాదంటూ వ్యాఖ్యలు
తనవద్దకు వచ్చిన కొందరు భవన నిర్మాణ కార్మికులు తమ బాధలు వ్యక్తపరిచి కన్నీటిపర్యంతమయ్యారని వెల్లడించారు. రాష్ట్రంలో నూతన ఇసుక విధానం ప్రకటించడానికి ప్రభుత్వం సెప్టెంబరు 5 వరకు ఆగాల్సిన అవసరం ఏంటని పవన్ తన లేఖలో ప్రశ్నించారు. అప్పటివరకు కూలి పనులు చేసుకునేవాళ్లు ఏమైపోవాలంటూ నిలదీశారు. ఇలాంటి కష్టకాలంలో భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆకలి బాధలు ప్రభుత్వానికి ఏమంత మంచిది కాదన్నారు.