APERC: హైదరాబాద్ నుంచి ఏపీకి తరలిన మరో కార్యాలయం!

  • విభజన తరువాత హైదరాబాద్ లో కొనసాగిన ఏపీఈఆర్సీ
  • తక్షణం తరలిస్తూ ఆదేశాలు జారీ
  • అమరావతి నుంచి విద్యుత్ నియంత్రణా మండలి కార్యకలాపాలు
ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత కూడా అమరావతికి వెళ్లకుండా, ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చిన ఏపీఈఆర్సీ (ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ - విద్యుత్ నియంత్రణ మండలి)ని తరలిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తక్షణం ఏపీఈఆర్సీని అమరావతి ప్రాంతానికి మారుస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇకపై విద్యుత్ నియంత్రణ మండలి ఏపీ రాజధాని ప్రాంతం నుంచే పని చేస్తుందని ప్రకటిస్తూ, విద్యుత్ శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకూ ఏపీఈఆర్సీ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో ఉండగా, ఉన్నతాధికారులు అటూ, ఇటూ తిరుగుతూ విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. 
APERC
Hyderabad
Andhra Pradesh
Telangana
Amaravati

More Telugu News