Baba Bhaskar: నేను నాలాగే ఉండటం చాలా మందికి నచ్చలేదు: డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్

  • కష్టపడి పైకిరావడమే నాకు ఇష్టం 
  • సమయాన్ని బట్టి మారలేను 
  • ఎవరేమనుకున్నా పట్టించుకోనన్న బాబా భాస్కర్
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ మాట్లాడుతూ, తన మనసులోని మాటను చెప్పారు. "ఇండస్ట్రీలో ఎదుటివారికి మొక్కుతూ పైకి రావాలి .. లేదంటే ఎదుటివారిని తొక్కుతూ పైకి రావాలి అని అంటూ వుంటారు. కానీ ఆ రెండింటికి నేను దూరంగానే వుంటాను. కష్టపడి పైకి రావాలనేదే నా ఉద్దేశం.

మొదటి నుంచి కూడా నేను నాలాగే ఉంటూ వస్తున్నాను. సమయాన్ని బట్టి .. పరిస్థితులను బట్టి మారడం నాకు చేతగాదు. అలా మనిషి మనిషికి నేను మారుకుంటూ వెళితే ఇంకా చాలా అవకాశాలు వచ్చేవేమో. కానీ అలా మారడం నాకు ఇష్టం ఉండదు. నేను నాలా ఉండటం చాలా మందికి నచ్చడం లేదనే విషయం నాకు తెలుసు. అయినా నేను పెద్దగా పట్టించుకోను. నా పనిని నేను చేసుకోవడం .. చేతనైతే ఇతరులకు సాయపడటం .. ఇవే నాకు తెలిసింది" అని చెప్పుకొచ్చారు.
Baba Bhaskar
Ali

More Telugu News