Dear Comred: 'డియర్ కామ్రేడ్'లో సర్ ప్రైజ్... చూస్తేనే తెలుస్తుందన్న రష్మిక!

షార్ట్స్‌లో చూడండి
గత వారంలో విడుదలై, మిశ్రమ స్పందనతో నడుస్తున్న 'డియర్ కామ్రేడ్'కు ఇంకాస్త పబ్లిసిటీ ఇచ్చి, మరికొంత కలెక్షన్లు రాబట్టాలని భావిస్తున్న చిత్ర యూనిట్, తిరిగి ఎడిటింగ్ పనిలో పడింది. సినిమా రెండో భాగం నిడివి ఎక్కువైందని విమర్శలు రాగా, కనీసం పావు గంట వరకూ సినిమాను ట్రిమ్ చేస్తున్నట్టు సమాచారం.

ఇక తాజాగా చిత్రం హీరోయిన్ రష్మిక తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "వినండి. డియర్ కామ్రేడ్ టీమ్ మీ అందరికీ థియేటర్లలో సర్ ప్రయిజ్ ఇవ్వనుంది. అదేంటో నేను చెప్పను. మీరే అనుభూతి చెందాలి. మీ అందరి సూచనలను పరిగణనలోకి తీసుకున్నాం. ఇంతకన్నా నేను మీకు ఎటువంటి క్లూస్ ఇవ్వలేను" అని పేర్కొంది. తెలంగాణలో ఓ మోస్తరుగా ఉన్నా, ఆంధ్రాలో దారుణంగా పడిపోయిన కలెక్షన్స్ ఈ మార్పుతో కాస్తయినా పెరుగుతాయేమో చూడాలి.
Go Back to Shorts
Dear Comred
Rashmika
Twitter
Length

More Telugu News