చావుబతుకుల్లో ఉన్న బాలిక తల్లిదండ్రుల వాదన విని వైద్యులు షాక్!
- అనారోగ్యానికి గురైన కాంచన్
- కిడ్నీ దానం చేయాలని కోరిన వైద్యులు
- ససేమిరా అన్న కుటుంబ సభ్యులు
అయితే కాంచన్ కుటుంబ సభ్యులు మాత్రం దీనికి ససేమిరా అన్నారు. కారణం విని వైద్యులే షాక్ అయ్యారు. ఆడపిల్లకు కిడ్నీ దానం చేయడమేంటంటూ తల్లిదండ్రుల వాదన విన్న డాక్టర్లు నిర్ఘాంతపోయారు. ఈ విషయం బీహార్‌లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో సైతం వైరల్ అవడంతో అంతర్జాతీయ మీడియాలో పలు కథనాలు వచ్చాయి. ఇది చూసిన అమెరికాకు చెందిన షార్లే నోర్డిన్, కాంచన్‌కు సాయమందించేందుకు ముందుకు వచ్చారు. తాను కిడ్నీ దానం చేస్తానని ప్రకటించారు.