Jagan: జగన్ పై రోశయ్య ఆసక్తికర వ్యాఖ్యలు

  • జగన్ ఆలోచనలు ఏమిటో అర్థం కావడం లేదు
  • కేంద్రంతో సఖ్యతగా ఉండటం లేదు
  • ఖర్చులను తగ్గించుకోకపోతే ఇబ్బందులు తప్పవు
ఏపీ ముఖ్యమంత్రి జగన్, వైసీపీ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఆలోచనలు ఏంటో తనకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ముందుకు వెళ్లడం లేదని, ప్రతిపక్షాలను కూడా కలుపుకుని వెళ్లడం లేదని చెప్పారు. మరి కొంత కాలం తర్వాత జగన్ విషయంలో స్పష్టత రావొచ్చని అన్నారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకోవాలని సూచించారు. ఖర్చులు తగ్గించుకోకుంటే రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. 
Jagan
Rosaiah
YSRCP

More Telugu News