Mahesh Babu: తన సొంత బ్రాండ్ పేరు వెల్లడించిన మహేశ్ బాబు

  • 'ద హంబుల్ కో' పేరుతో మహేశ్ బాబు దుస్తుల వ్యాపారం
  • ఆగస్టు 7న ప్రారంభం అవుతుందంటూ ట్వీట్
  • ఇది బ్రాండ్ కాదు జీవనశైలి అంటూ వ్యాఖ్యలు
టాలీవుడ్ అగ్రహీరోలు సైడ్ బిజినెస్ ల్లోనూ బిజీగా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మల్టీప్లెక్స్ రంగంలో కాలుమోపిన మహేశ్ బాబు తాజాగా బ్రాండెడ్ దుస్తుల వ్యాపారంలో ప్రవేశిస్తున్నాడు. ఇటీవలే తన లేటెస్ట్ బిజినెస్ గురించి ఓ లింక్ షేర్ చేసిన మహేశ్ బాబు నేడు తన బ్రాండ్ నేమ్ వెల్లడించాడు. 'ద హంబుల్ కో' (The HUMBLE co)ను ఆవిష్కరిస్తున్నామని, మీ కలల దుస్తులను సాకారం చేసుకోండంటూ మహేశ్ ట్వీట్ చేశాడు.

ఈ సందర్భంగా తన బ్రాండ్ నేమ్ లోగోను కూడా పోస్టు చేశాడు. 'ద హంబుల్ కో' అనేది ఓ క్లాతింగ్ బ్రాండ్ మాత్రమే కాదని, ఇదొక జీవనశైలి అని పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరినీ 'హంబుల్ కో' కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపాడు. ఆగస్టు 7న లాంచ్ చేస్తున్నామని ట్విట్టర్ లో వెల్లడించాడు. 
Mahesh Babu
Tollywood
The HUMBLE co

More Telugu News