Varla Ramaiah: అయ్యా ఏపీ సీఎం... చంద్రబాబు మీద కోపం అమరావతిపై చూపకండి: జగన్ కు వర్ల రామయ్య హితవు

  • ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తిన వర్ల
  • రాజధానిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపాటు
  • ధర్మపాలన చేయండంటూ ట్వీట్

టీడీపీ నేత వర్ల రామయ్య ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్విట్టర్ లో తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు మీద కోపం అమరావతిపై చూపకండి, ధర్మపాలన చేయండి అంటూ హితవు పలికారు. "అయ్యా ఏపీ సీఎం, అమరావతిని చంద్రబాబు కన్నబిడ్డలా చూసుకుంటే మీరేంటి సవతి బిడ్డలా నిర్లక్ష్యం చేస్తున్నారని రాష్ట్రమంతా కోడైకూస్తోంది. ఏపీ రాజధానిని చంద్రబాబు కంటికి రెప్పలా చూసుకున్నారు. మరి మీరెందుకు పట్టించుకోవడం లేదు? రాజధానిని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు?" అంటూ వర్ల రామయ్య ట్వీట్ చేశారు.

More Telugu News