29వ తేదీ నుంచి పవన్ ఆధ్వర్యంలో ‘జనసేన’ సమావేశాలు
- పార్టీ కమిటీలు, నాయకులు, పార్లమెంటరీ నియోజకవర్గాల సమావేశాలు
- విజయవాడ, మంగళగిరిలోని పార్టీ కార్యాలయాల్లో సమావేశాలు
- ముఖ్యనేతలతో పవన్ చర్చలు
పార్టీ బలోపేతం కోసం చేపట్టే కార్యక్రమాల నిర్వహణ గురించి ముఖాముఖీ చర్చలు ఉంటాయని, 29వ తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి పార్టీ నాయకులు, వివిధ కమిటీల సభ్యులతో పవన్ కల్యాణ్ చర్చిస్తారని, అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో జరుగుతుందని అన్నారు. 30వ తేదీ సమయం 11 గంటలకు నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గం, 4 గంటలకు కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం, 31వ తేదీ ఉదయం 11 గంటలకు రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గం సమావేశాలను మంగళగిరి పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తామని వివరించారు.