జగన్ గారూ.. ఓ విద్యార్థిపై అక్రమ కేసులు పెట్టేస్థాయికి వైసీపీ దిగజారిపోయిందా?: నారా లోకేశ్ ఆగ్రహం

  • వర్ధన్ పై అక్రమ కేసులు బనాయించారు
  • అతనికి నేను, టీడీపీ అండగా ఉంటాం
  • ఇలాంటి పిరికిపంద చర్యలను తిప్పికొడతాం
వర్ధన్ అనే విద్యార్థిపై వైసీపీ నేతలు అక్రమ కేసులు పెట్టారని టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ విద్యార్థిపై కేసులు పెట్టే స్థాయికి వైసీపీ దిగజారిపోయిందా? అని సీఎం జగన్ ను ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా తాను, టీడీపీ వర్ధన్ కు అండగా ఉంటామని ప్రకటించారు.

ఇలాంటి పిరికిపంద చర్యలను తిప్పికొడతామని హెచ్చరించారు. ఈ మేరకు నారా లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. అయితే వర్ధన్ పై వైసీపీ నేతలు ఎప్పుడు, ఎక్కడ కేసులు పెట్టారన్న విషయమై నారా లోకేశ్ స్పష్టత ఇవ్వలేదు.
Go Back to Shorts
Andhra Pradesh
Jagan
Chief Minister
YSRCP
cases
Police
vardhan
Nara Lokesh
Telugudesam
Twitter

More Telugu News