వైసీపీ మహిళా ఎమ్మెల్యేలపై ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు.. నిందితుడి కోసం వేట

  • పోలీసులకు ఫిర్యాదు చేసిన శాసన సభ కార్యదర్శి
  • నిందితునిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
  • పరారీలో ఉన్న పునుగుపాటి రమేష్‌
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా ఎమ్మెల్యేలపై అసభ్యకర పోస్టింగ్స్‌, ఫొటోలను ఫేస్‌బుక్‌లో ఉంచిన పునుగుపాటి రమేష్‌ అనే వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహిళా శాసన సభ్యులను అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ శాసన సభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు ఉంచిన పోస్టింగ్స్‌, ఫొటోలు పోలీసులకు అందించారు. దీంతో రమేష్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం వేట మొదలు పెట్టారు. గతంలో అనంతపురం జిల్లాలోనూ రమేష్‌పై ఇటువంటి కేసు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. రమేష్‌ పోస్టింగ్స్‌పై స్పీకర్‌ తమ్మినేని సీతారాం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
YSRCP
MLA's
Facebook
postings
case filed

More Telugu News