kodela shivaprasad: ఏపీ మాజీ స్పీకర్ కోడెల కుమార్తెకు హైకోర్టులో ఎదురుదెబ్బ.. బెయిల్ పిటిషన్లు కొట్టివేత

  • కోడెల కుటుంబంపై 15 కేసులు నమోదు
  • కుమార్తె విజయలక్ష్మిపై నరసరావుపేటలో 4 కేసులు
  • బెయిలు ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుమార్తె విజయలక్ష్మికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆమె పెట్టుకున్న ముందస్తు బెయిలు పిటిషన్లు నాలుగింటినీ కొట్టేసింది. నరసరావుపేట టౌన్‌, రూరల్ పోలీస్ స్టేషన్లలో తనపై నమోదైన కేసులన్నీ అక్రమమైనవేనని పేర్కొన్న విజయలక్ష్మి, హైకోర్టులో బెయిలు పిటిషన్  దాఖలు చేశారు. వీటిని పరిశీలించిన న్యాయస్థానం వాటిని కొట్టివేసింది. కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల కుటుంబంపై ఇప్పటి వరకు 15 కేసులు నమోదయ్యాయి. టీడీపీ  అధికారంలో ఉన్న సమయంలో స్పీకర్‌గా ఉన్న కోడెల అధికారాన్ని అడ్డం పెట్టుకుని  ఆయన కుమార్తె, కుమారుడు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, ‘కే టాక్స్’ పేరుతో దందాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. 

More Telugu News