Stock market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • వరుసగా ఆరు రోజుల నష్టాలు 
  • ఆటో షేర్ల రాణింపు 
  • లాభాల్లో 'ఎస్ బ్యాంక్' షేర్  

 వారాంతాన్ని మన స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగించాయి. వరుసగా ఆరు రోజుల నష్టాల తర్వాత నేడు మన మార్కెట్లు స్వల్ప లాభాలను నమోదు చేశాయి. కేంద్ర బడ్జెట్ ప్రభావంతో గత కొన్ని సెషన్లుగా విదేశీ పెట్టుబడిదారులు మన మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్న నేపథ్యంలో ఈ రోజు ఆద్యంతం మార్కెట్లు ఊగిసలాటలో సాగాయి.

చివరికి ఆటో షేర్లు, ఎస్ బ్యాంక్ షేర్లు బాగా రాణించడంతో సెన్సెక్స్  52 పాయింట్ల లాభంతో 37883 వద్ద, నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 11284 వద్ద ముగిశాయి. ఇక నేటి ట్రేడింగులో ఎస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, హీరో మోటాకార్ప్, ఎం&ఎం, బజాజ్ ఆటో, టాటా మోటార్స్ తదితర షేర్లు లాభపడగా; వేదాంత, ఐఓసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, గెయిల్ తదితర షేర్లు నష్టపోయాయి.   

More Telugu News