Narendra Modi: 20 ఏళ్ల నాటి అరుదైన ఫొటోలను షేర్ చేసిన నరేంద్ర మోదీ!

  • 1999లో కార్గిల్ యుద్ధం
  • పాక్ సైన్యం పీచమణచిన భారత్
  • గుర్తు చేసుకున్న మోదీ

ఇండియాపై దురాక్రమణకు ప్రయత్నించి, కార్గిల్, ద్రాస్ సెక్టర్లలో చొరబడి, యుద్ధానికి దిగిన పాకిస్థాన్ సైన్యం పీచమణిచిన కార్గిల్ వార్ జరిగి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా ఇప్పటి ప్రధాని, నాడు గుజరాత్ సీఎంగా ఉండి కార్గిల్ లో పర్యటించిన వచ్చిన నరేంద్ర మోదీ కొన్ని అరుదైన చిత్రాలను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. నేడు విజయ్ దివస్ సందర్భంగా న్యూఢిల్లీలోని అమర వీరుల స్మారకం వద్ద ఆయన నివాళులు అర్పించారు. భరతమాత కోసం కార్గిల్ లో వీరమరణం పొందిన వారికి, ప్రాణాలకు తెగించి పోరాడిన వారికి తాను సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. భారత సైనికుల్లోని ధైర్యం, సాహసాలను విజయ్ దివస్ గుర్తు చేస్తుందని చెప్పారు. కార్గిల్ యుద్ధం జరిగిన సమయంలో తాను జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్నానని, ఆ సమయంలోనే సైన్యాన్ని కలిశానని గుర్తు చేసుకున్నారు.

More Telugu News