Vijay Sai Reddy: బాబు, చినబాబు, పెద్ద తలకాయల బండారం ఇక బయటకే..!: విజయసాయి రెడ్డి

  • బీహార్ గడ్డి కుంభకోణం కన్నా నీరు-చెట్టు స్కామ్ పెద్దది
  • విచారిస్తే నిజాలు బయటకు వస్తాయి
  • ట్విట్టర్ లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
మాజీ సీఎం చంద్రబాబునాయుడి హయాంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని, విచారిస్తే అవన్నీ బయటకు వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు. బీహార్ లో జరిగిన పశువుల దాణా కుంభకోణం కన్నా, నీరు-చెట్టు స్కామ్ పెద్దదని అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "చంద్రబాబు గారి ప్రభుత్వంలో జరిగిన నీరు-చెట్టు కుంభకోణం బీహార్ దాణా స్కాం కంటే పెద్దది. 22 వేల కోట్ల నిధులను జన్మభూమి కమిటీలకు పంచి పెట్టారు. సమగ్ర దర్యాప్తు జరిగితే బాబు, చిన బాబు ఇంకా అనేక పెద్ద తలకాయల బండారం బయట పడుతుంది" అని అన్నారు. 
Vijay Sai Reddy
Twitter
Bihar
Scam
Chandrababu
Enquiry

More Telugu News