Andhra Pradesh: ఏపీ, తెలంగాణ హైకోర్టుల న్యాయవాదులకు న్యాయమూర్తులుగా ప్రమోషన్!

  • ఏపీ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ముగ్గురి పేర్లు
  • కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన సుప్రీం కొలీజియం
  • వారిపై ఎటువంటి ఫిర్యాదులు లేవని స్పష్టీకరణ

ఏపీ, తెలంగాణ హైకోర్టులలో న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తున్న ఏడుగురికి ప్రమోషన్ లభించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయి, న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్‌వీ రమణలతో కూడిన సుప్రీంకోర్టు కొలీజియం వీరిని న్యాయమూర్తులుగా సిఫారసు చేసింది. ఈ మేరకు గురువారం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.

సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదించిన వారిలో ఏపీ హైకోర్టుకు చెందిన టి.రఘునందన్‌రావు, బట్టు దేవానంద్‌, డి.రమేశ్‌, ఎన్‌.జయసూర్య, తెలంగాణ హైకోర్టుకు చెందిన టి.వినోద్‌కుమార్‌, ఎ.అభిషేక్‌రెడ్డి, కె.లక్ష్మణ్‌ ఉన్నారు. వీరిపై ఎటువంటి ఫిర్యాదులు లేవని కొలీజియం పేర్కొంది.

More Telugu News