Jagan: 108 ఉద్యోగులతో చర్చలు సఫలం.. సమస్యల పరిష్కారానికి జగన్ ఓకే!

షార్ట్స్‌లో చూడండి
ఉద్యోగ భద్రతపై హామీతోపాటు పెండింగ్ వేతన బకాయిలను చెల్లించాలని, 108 అంబులెన్స్‌లు పెంచాలని కోరుతూ గత ఐదు రోజులుగా చేస్తున్న సమ్మెను ఏపీకి చెందిన 108 ఉద్యోగులు విరమించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డితో జరిపిన చర్చలు సఫలమయ్యాయని, సమ్మె విరమిస్తున్నామని 108 ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. తమ సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని, ఈ నెల 31లోపు వేతన బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే, ఉద్యోగ భద్రత కోసం ప్రత్యేకంగా ఓ విధానాన్ని తీసుకొస్తామని ఈ సందర్భంగా వారికి జగన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.  
Go Back to Shorts
Jagan
Andhra Pradesh
108 ambulance

More Telugu News