‘మ్యాచ్ ఫిక్సింగ్’, ‘క్విడ్ ప్రోకో’ అంటూ కేసీఆర్-జగన్ పై చంద్రబాబు విమర్శలు

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ లపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీలో మొన్న జరిగిన ఎన్నికల్లో ఖర్చు కోసం జగన్ కు కేసీఆర్ నిధులు పంపించారని, ఆ రుణం తీర్చుకునేందుకే భావి తరాల భవిష్యత్ ను తెలంగాణకు జగన్ తాకట్టుపెడుతున్నారని, ఆ అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. కేసీఆర్, జగన్ ల మధ్య ‘మ్యాచ్ ఫిక్సింగ్’, క్విడ్ ప్రోకో జరిగిందని ఆరోపించారు. నదీ జలాలపై, సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ వైఖరిని గతంలో జగన్ విమర్శించారని, ఈరోజున కేసీఆర్ ను పొగుడుతున్నారని దుయ్యబట్టారు. ఈ విషయాలన్నింటి గురించి తాము ప్రశ్నిస్తే జగన్ కు కోపం అని, తన ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Go Back to Shorts
Telugudesam
Chandrababu
TRS
Kcrs
YSRCP
jagan

More Telugu News