Vijay Devarakonda: మా నాన్న బతికుంటే బాగుండేది: 'డియర్ కామ్రేడ్' దర్శకుడు భరత్ కమ్మ

  • నాకు దర్శకత్వం పై ఆసక్తి ఎక్కువ 
  • తొలి అవకాశం దక్కడానికి పన్నెండేళ్లు పట్టింది
  •  భావోద్వేగానికి లోనైన భరత్ కమ్మ 

భరత్ కమ్మ దర్శకత్వంలో రూపొందిన 'డియర్ కామ్రేడ్' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. "ఎమ్మెస్ చేసేందుకు నన్ను యూఎస్ పంపించాలని మా అమ్మానాన్నలు అనుకున్నారు. కానీ దర్శకత్వం పట్ల గల ఇంట్రెస్ట్ తో నేను చిత్ర పరిశ్రమలోకి వచ్చాను.

నన్ను ఒక ఐదారేళ్లు వదిలేయమని అమ్మానాన్నలను రిక్వెస్ట్ చేశాను. కానీ దర్శకుడిగా తొలి అవకాశాన్ని దక్కించుకోవడానికి నాకు పన్నెండేళ్లు పట్టింది. మూడేళ్ల క్రిందటే ఈ కథ ఓకే అయినప్పటికీ, పట్టాలెక్కడానికి ఇంతకాలం పట్టింది. ఈ సినిమా షూటింగు సగభాగం పూర్తిచేసిన తరువాత మా నాన్న చనిపోయాడు. నా తొలి సినిమాను మా నాన్నకి చూపించలేకపోయానే అనే బాధ నన్ను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది" అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. 

More Telugu News