బాలకృష్ణ కొత్త సినిమాకి రంగం సిద్ధం .. బ్యాంకాక్ లో షూటింగ్

Thu, Jul 25, 2019, 03:05 PM
  • మరోసారి కేఎస్ రవికుమార్ తో బాలకృష్ణ 
  • వచ్చేనెల 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • నాయికలుగా సోనాల్ చౌహాన్ - వేదిక
బాలకృష్ణ కథానాయకుడిగా కేఎస్ రవికుమార్ చేసిన 'జై సింహా' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఇదే కాంబినేషన్లో మరో సినిమా రూపొందడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకి 'రూలర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇది ఎప్పుడు సెట్స్  పైకి వెళుతుందా అని బాలయ్య అభిమానులంతా ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు.

ఆగస్టు 7వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెట్టనున్నారనేది తాజా సమాచారం. తొలి షెడ్యూల్ ను బ్యాంకాక్ లో ప్లాన్ చేశారట. ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లో అక్కడ కొన్ని సన్నివేశాలను .. నాయకా నాయికలపై పాటలను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కథానాయికలుగా సోనాల్ చౌహన్ .. వేదికల పేర్లు వినిపిస్తున్నాయి. 
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Aha
Latest Video News..
Advertisement