ఒక జాతీయ పార్టీ ఇంతకు తెగించడాన్ని నమ్మలేకపోతున్నా: దేవెగౌడ

24-07-2019 Wed 19:07
  • రాజకీయ పరిణామాలను దేశం మొత్తం చూస్తోంది
  • ఇలాంటి బేరసారాలను ఎప్పుడూ చూడలేదు
  • ప్రభుత్వాన్ని పడగొట్టే ఇలాంటి తీరు తెలియదు
కర్ణాటకలో తాజా రాజకీయ పరిణామాలపై స్పందించిన జేడీఎస్ అధినేత హెచ్‌డి దేవెగౌడ బీజేపీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పరిణామాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్ణాటకలో ప్రస్తుతమున్న రాజకీయ పరిణామాలను దేశం మొత్తం చూస్తోందని, తన రాజకీయ జీవితంతో ఇంత దారుణమైన బేరసారాలను ఎప్పుడూ చూడలేదన్నారు. ఒక జాతీయ పార్టీ ఇంతటి తెగింపును తాను నమ్మలేకపోతున్నానన్నారు. ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసి ప్రభుత్వాల్ని కూల్చడం అనేది తనకింత వరకూ తెలియదన్నారు.