Sensex: షేర్లను అమ్మేస్తున్న విదేశీ ఇన్వెస్టర్లు.. వరుసగా ఐదో రోజు పతనమైన మార్కెట్లు

  • ఆశాజనకంగా లేని కార్పొరేట్ ఫలితాలు
  • 135 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 59 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిశాయి. దాదాపు అన్ని సూచీలు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. కేంద్ర బడ్జెట్ అనంతరం విదేశీ ఇన్వెస్టర్లు భారీ ఎత్తున తమ షేర్లను అమ్మేస్తున్నారు. కార్పొరేట్ ఫలితాలు కూడా ఆశాజనకంగా లేకపోవడం మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 135 పాయింట్లు నష్టపోయి 37,847కి పడిపోయింది. నిఫ్టీ 59 పాయింట్లు కోల్పోయి 11,271కి దిగజారింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఏషియన్ పెయింట్స్ (3.42%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.06%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.84%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.95%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.70%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.87%), బజాజ్ ఫైనాన్స్ (-3.17%), టాటా మోటార్స్ (-3.17%), టాటా స్టీల్ (-3.06%), హీరో మోటో కార్ప్ (-2.63%).

More Telugu News