నా భార్య ఆరోగ్యమే నాకు ముఖ్యం: కౌశల్
- బుల్లితెరపై కౌశల్ కి క్రేజ్
- భార్య కేన్సర్ తో బాధపడుతోంది
- సినిమాల సంగతి తరువాత ఆలోచిస్తానన్న కౌశల్
ఆ తరువాత ఆయన ఒక్క సినిమాను ఒప్పుకున్నది లేదు. దాంతో సినిమా ఎప్పుడు చేస్తారంటూ చాలామంది ఆయనను ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మామూలుగానే అడుగుతున్నారు. ఈ విషయంపై ఇన్స్టా గ్రామ్ ద్వారా కౌశల్ స్పందిస్తూ .. " నా జీవితాన్ని చూసుకోవడం కంటే నా భార్యను కాపాడుకోవడమే ముఖ్యం. ఆమె ఆరోగ్యం నా కెరియర్ కంటే ఎక్కువ. ఆమె ఆరోగ్యం మెరుగైన తరువాతనే సినిమాల గురించి ఆలోచిస్తాను" అని చెప్పుకొచ్చాడు.