Andhra Pradesh: సీఎం జగన్ అంటేనే ఏపీ ప్రజలు భయపడిపోతున్నారు.. పాలన చూస్తుంటే భయమేస్తోంది!: బీజేపీ నేత రామ్ మాధవ్
- మేలు కంటే కీడే జరుగుతుందని భయమేస్తోంది
- వైసీపీ వర్తమానం.. భవిష్యత్ బీజేపీదే
- తూర్పుగోదావరి లో బహిరంగ సభలో రామ్ మాధవ్
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వ పాలన చూస్తుంటే భయాందోళనలు కలుగుతున్నాయని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వల్ల ప్రజలకు మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతోందన్న భయం కలుగుతోందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు సీఎం జగన్ అంటేనే భయపడిపోతున్నారని దుయ్యబట్టారు.
ఏపీలో టీడీపీ గతమనీ, వర్తమానం వైసీపీదనీ, భవిష్యత్ బీజేపీదని జోస్యం చెప్పారు. తూర్పుగోదావరి జిల్లాలోని పి.గన్నవరంలో జరిగిన బహిరంగ సభలో రామ్ మాధవ్ ఈరోజు మాట్లాడారు. ఏపీ ప్రజలు గత్యంతరం లేని పరిస్థితుల్లో వైసీపీకి ఓటేశారని రామ్ మాధవ్ అన్నారు. 2024 నాటికి సొంతంగా ఏపీలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.